TG: ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెంలో వర్షాలు పడతాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని సూచించింది.