TG: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు సహా మహిళ మృతి చెందింది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు కుంటలో పడగా.. వారికి కాపాడానికి వెళ్లిన మహిళ కుంటలో పడి మరణించింది. మృతులు ఉమాదేవి మాంజి(32), కిరానికుమార్(13), బిర్జు మాంజి(6)గా పోలీసులు గుర్తించారు.