ATP: శింగనమల మండలం సీ.బండమీదపల్లి గ్రామంలో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. ఓ రైతు పొలంలో గొర్రెల మంద మేస్తుండగా, పంటకు పిచికారి చేయడానికి కలిపి ఉంచిన మందు నీళ్లను గొర్రెలు తాగాయి. దీనివల్ల సుమారు 70 గొర్రెలు మృతి చెందగా, మరికొన్ని విషమ పరిస్థితిలో ఉన్నాయి. గొర్రెల కాపరులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.