KKD: గత పది రోజులుగా కాకినాడ, పోలవరం జిల్లాలలో ఏలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతం, అటవీ ప్రాంతాలలో పెద్దపులి సంచరిస్తుంది. ప్రత్తిపాడు మండలం దారపల్లి గ్రామం సమీపంలోని వాటర్ ఫాల్స్ పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు వెళ్ళకూడదని సూచించారు.