JGL: కోరుట్ల పట్టణంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న యశ్వంత్, శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి శనివారం తెలిపారు. పట్టణంలో దాడులు నిర్వహించి వారి వద్ద నుంచి నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా అమ్మినా, వినియోగించినా.. వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.