NLG: మహిళా ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన బంటువారిగూడెంలో చోటు చేసుకుంది. నిడమనూర్ మండలం బంటువారి గూడెం గ్రామానికి చెందిన మెరుగు సోమమ్మ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది యాదగిరి ప్రాథమిక చికిత్స చేసి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.