TG: ములుగు జిల్లా ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి సీతక్క అన్నారు. తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని అడవులు స్వచ్ఛమైన వాతావరణంతో నిండివుండి, ఊటీ, కొడైకెనాల్‌కు మించిన అందాలను కలిగి ఉన్నాయని తెలిపారు.