NGKL: జిల్లాలో 1,044 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం తెలిపారు. ఈ యాసంగి సీజన్లో 18,170 టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశారు. మిగిలిన మూడు నెలలకు 37,247 టన్నుల యూరియా అవసరమని ఇండెంట్ పెట్టారు. సోమవారం నుంచి వివిధ మార్గాల ద్వారా యూరియా జిల్లాకు చేరుకుంటుంది.