వడోదర వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డికి చోటు దక్కలేదు. జట్టులో సుందర్, జడేజా, కుల్దీప్ స్పిన్నర్లుగా.. సిరాజ్, ప్రసిద్ధ్, హర్షిత్ పేసర్లుగా ఆడుతున్నట్లు కెప్టెన్ గిల్ చెప్పాడు. ఈ కారణం చేతనే అతడికి తుది జట్టులో చోటు కల్పించలేకపోయినట్లు గిల్ స్పష్టం చేశాడు.