AP: మందడం ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. గతం ప్రభుత్వంలో రాజధాని మహిళలను వేధించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే, ఎన్ని ప్రయత్నాలు చేసిన అమరావతి అభివృద్ధి ఆగదని పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలను పంచాలని సీఎం కోరికని అన్నారు.