టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్లు హెన్రీ నికోల్స్, డేవన్ కాన్వే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో కివీస్ 20 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 104 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కుల్దీప్ యాదవ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో నికోల్స్ బతికిపోయాడు.