ఇవాళ దర్శకుడు సుకుమార్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే డార్లింగ్ సుకుమార్. ఈరోజు నీకంటే నాకు ఇంకా ప్రత్యేకం.. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిన రోజు ఇదే. నా జీవితంలో నువ్వు నాకు ఎంత స్పెషల్ అనేది మాటల్లో చెప్పలేను. నువ్వు పుట్టినందుకు థ్యాంక్స్’ అంటూ పోస్ట్ పెట్టాడు. కాగా, వీరి కాంబోలో ‘ఆర్య’, ‘ఆర్య 2’, ‘పుష్ప’, ‘పుష్ప 2’లు వచ్చాయి.