TG: తెలంగాణపై పవన్ కళ్యాణ్‌కు అమితమైన ప్రేమ ఉందని జనసేన జనరల్ సెక్రటరీ తాళ్లూరి రామ్ అన్నారు. త్వరలో తెలంగాణలో పవన్ పర్యటన, సమావేశాలు ఉంటాయని తెలిపారు. మున్సిపల్, GHMC ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోసం అడ్‌హక్ కమిటీలు వేసినట్లు వెల్లడించారు. పొత్తు లేకున్నా జనసేన పోటీకి సిద్ధమని రామ్ పేర్కొన్నారు.