JN: చిల్పూర్ మండలం లింగంపల్లి మినీ మేడారం జాతర సందర్భంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రేపు టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జాతరకు సంబంధించి కొబ్బరికాయలు, కోళ్లు, లడ్డు, పులిహోర, దేవి ప్రసాదం, తల వెంట్రుకలు, బెల్లం తదితర అంశాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. అర్హతలు కలిగిన వ్యక్తులు టెండర్ రుసుము చెల్లించి టెండర్లో పాల్గొనవచ్చు అని అన్నారు.