VSP: భోగి పండగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. ఆదివారం మద్దిలపాలెం ఏయూ గ్రౌండ్లో సంక్రాంతి పండుగను నిర్వహించారు. టైర్లు, ప్లాస్టిక్ కాల్చవద్దని, పిడకలతో సంప్రదాయ భోగి మంటలు వేయాలని సూచించారు. పర్యావరణ రక్షణతో ఆరోగ్యంగా పండగ జరుపుకోవాలన్నారు.