E.G: పండగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు అని వైసీపీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డా. గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. దివాన్ చెరువులో హరిదాసులు గంగిరెద్దులతో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. మారుతున్న కాలంతో పోటీపడుతూ మరుగున పడుతున్న మన సంస్కృతిని భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.