ADB: సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగిరే వేసేటప్పుడు విద్యుత్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆదిలాబాద్ SE శేషరావు రాథోడ్ సూచించారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల వద్ద పతంగులు ఎగురవేయడం ప్రమాదకరమన్నారు. ఒకవేళ విద్యుత్ వైర్లపై పతంగులు, మాంజాలు చిక్కుకున్నా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని వివరించారు.