PLD: పండుగ వారం కావడంతో చికెన్ ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. నరసరావుపేటలో ఆదివారం లైవ్ కోడి కేజీ గత వారంతో పోలిస్తే రూ. 6 పెరిగి రూ. 159గా ఉంది. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్, పెద్ద చెరువు, సత్తెనపల్లి రోడ్డు తదితర ప్రాంతాల్లో చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 260 నుంచి రూ. 280 విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ప్రాంతాలను బట్టి స్వల్ప మార్పులుంటాయన్నారు.