బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు బాపట్ల పట్టణం రైలుపేట ప్రాంతంలో తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ సిబ్బంది ఇంటింటా తనిఖీలు చేపట్టి, వాహనాలపై ఆకస్మిక తనిఖీ చేశారు. లైసెన్స్, నంబర్ ప్లేట్లు, వాహన పత్రాలు పరిశీలించి, నిబంధనలు పాటించిన వారిని అనుమతించారు. ఈ కార్యక్రమంలో పోలిస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.