TG: CM రేవంత్ రెడ్డికి బూతులు తప్ప వేరే భాష రాదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టారా? అని నిలదీశారు. రేవంత్ కట్టే వ్యక్తి కాదని.. కూలగొట్టే వ్యక్తి అని తెలిపారు. వివేక్, పొంగులేటి, మహేందర్ రెడ్డి ఇళ్లు హైడ్రా వాళ్లకు కనిపించడం లేదా? అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మోసాలు ఆపి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.