AP: రాయలసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు చరమగీతం పాడారని మాజీమంత్రి కాకాణి గోవర్దన్ విమర్శించారు. చంద్రబాబు, రేవంత్ మధ్య రహస్య ఒప్పందం బయటపడిందని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రారంభించే వరకు పోరాటం ఆగదని తెలిపారు. 2029లో జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తే ఊరుకోమని కాకాణి హెచ్చరించారు.