GNTR: చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలోని కేసీ ఎయిడెడ్ పాఠశాల శతజయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ శిలాఫలకం, డిజిటల్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించారు. వందేళ్ల చరిత్రతో వేల మంది మేధావులను తయారు చేసిన ఈ పాఠశాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పాఠశాల కమిటీ సభ్యులుపూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.