RR: చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మున్సిపాలిటీ గుల్షన్ కాలనీలో మిషన్ భగీరథ త్రాగు నీరు పైప్ లైన్ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా చేవెళ్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ పామేన భీమ్ భరత్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మొయినాబాద్ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు మానయ్య, మాజీ ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.