అన్నమయ్య: కడప-రాయచోటి-మదనపల్లె-బెంగళూరు రైల్వే లైన్ను వెంటనే పూర్తి చేయాలని యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం 100% నిధులు కేటాయించేలా సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని కోరారు. రాష్ట్ర వాటా నిధులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఆయన తెలిపారు.