ELR: సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు అనుమతి లేని మద్యం బాటిళ్లు తీసుకురావడం చట్టరీత్యా నేరమని నూజివీడు ఎక్సైజ్ సీఐ ఏ. మస్తానయ్య అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మద్యం వెంట తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తమ సహకరించాలని కోరారు.