HNK: కాజీపేట రైల్వే స్టేడియంలో జనవరి 11 నుంచి 15 వరకు 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 2 వేల మంది క్రీడాకారులు హాజరుకానున్నారని తెలిపారు.