NZB: బర్దిపూర్ శివారులో నుంచి ట్రాక్టర్ను దొంగలించిన వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసినట్లు డిచ్పల్లి CI వినోద్ తెలిపారు. కామారెడ్డి జిల్లా రాజానగర్కు చెందిన డ్రిల్లింగ్ మిషన్ వర్కర్ ఇరిగిదిండ్ల కరుణాకర్ (29) డిసెంబర్ 5న ట్రాక్టర్ దొంగిలించినట్లు చెప్పారు. శనివారం మధ్యాహ్నం నిందితుడు పట్టుబడగా అరెస్ట్ చేసి ట్రాక్టర్ను సీజ్ చేశామన్నారు.