ATP: తెరన్నపల్లికి చెందిన YCP నాయకుడు వెంకట చౌదరి కుమారుడు తారకేశ్వర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకేశ్వర్ను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఉదయం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.