KRNL: మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామస్థులకు ఎస్సై సల్ల మల్లికార్జున శనివారం రాత్రి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణించవద్దని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, అతివేగం చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపడం శిక్షార్హమని తెలిపారు.