JGL: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కోరుట్లలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి కీ.శే.జువ్వాడి రత్నాకర్ రావు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న KPL సీజన్ -6 టోర్నమెంట్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.