BHPL: ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ. 10,116 విలువైన బీరువాను ఇవాళ బొల్లం అరుణ-భాస్కర్ దంపతులు బహుకరించారు. ఈ సందర్భంగా అర్చకులు ఎం. నరేష్ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్, ఆలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.