HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శీవాలయం ప్రాంగణంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో 11 జనవరి 2026 ఇవాళ ధనుర్మాసం సంధర్భంగా, పద్మావతీ అలమేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేసి, అలంకరించి, పూజలు చేశారు. శ్రీమతి వనజాక్షి నేతృత్వంలోని భక్తుల బృందం, గోవింద నామాలను స్మరిస్తూ, తిరుప్పావై పాశురాలను పారాయణం చేశారు.