బానిస మనస్తత్వంతో సోమనాథ్ ఆలయ ప్రాముఖ్యతను విస్మరించారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ చేసిన ఆలయ పునర్నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ధ్వజమెత్తారు.