KRNL: ఆదోని మండలం జీ.హోసల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు రాము తండ్రి మృతి పట్ల జనసేన పార్టీ ఇంఛార్జ్ మల్లప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాము కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఇవాళ అంత్యక్రియల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కష్టసమయంలో జనసేన పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.