స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్తో తొలి వన్డేలో బరిలోకి దిగిన కోహ్లీ.. భారత్ తరఫున 309 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. దీంతో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 308 మ్యాచ్ల రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తంగా భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్ల జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నాడు. సచిన్(463) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.