ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక అమరావతి గ్రౌండ్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కార్యాలయ ప్రతినిధి తిరుమల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఆరు మండలాల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి చెప్పవచ్చని తెలిపారు.