KMM: కాల్ సెంటర్లు, ఏపీకే ఫైళ్లు, ఓటీపీల ద్వారా అమాయకులను బురిడీ కొట్టించి రూ.547 కోట్లు కొల్లగొట్టిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం పెనుబల్లి పోలీస్ స్టేషన్లో సీపీ సునీల్ దత్ వివరాలు వెల్లడిస్తూ.. ఈ ముఠా విదేశీ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి మోసాలకు పాల్పడిందని తెలిపారు. నిందితుల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.