KRNL: ఆలూరు మండలం అరికేర గ్రామంలో గొర్రెల మృతి ఘటన రైతు కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గ్రామానికి చెందిన ఎర్రమల్లయ్య, నాగప్ప కుమారుడు కారప్పకు చెందిన గొర్రెల మందకు ఇవాళ అకస్మాత్తుగా వ్యాధి వ్యాపించడంతో 18 గొర్రెలు మృతి చెంది మరో 20 గొర్రెలు అస్వస్థతకు గురైనట్లు గొర్రెల కాపరి కారప్ప తెలిపారు. గొర్రెలు ఒక్కసారిగా బలహీనపడి మృతి చెందాయని పేర్కొన్నారు.