TG: అబద్ధాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం బేకారు రాష్ట్ర సమితి(BRSను ఉద్దేశించి)కి అలవాటే అని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. అంగన్వాడీలకు ఇచ్చిన A06ఫోన్లను మార్కెట్ ధర కన్నా తక్కువకే ప్రభుత్వం కొన్నదని చెప్పారు. కానీ బీఆర్ఎస్ నేతలు తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.