TG: HYDలో అక్రమ ఆక్రమణలకు గురైన 11 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 1650 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కొండాపూర్లో 2 ఎకరాల పార్కు స్థలాన్ని, ప్రగతినగర్ అంబీర్ చెరువు సమీపంలోని 9 ఎకరాల స్మశాన వాటిక, డంపింగ్ యార్డు స్థలాలను అధికారులు కాపాడారు. అక్కడ ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.