KMM: పాలేరు నియోజకవర్గ పరిధిలోని రాజేశ్వరపురం, పాలేరు గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాజేశ్వరపురంలో 2 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హేమలత వెల్లడించారు. అక్రమ మద్యం రవాణా, సారా తయారీపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.