HNK: క్షయవ్యాధిని నిర్మూలించడం మన అందరి బాధ్యతని, ప్రతిఒక్కరు టీబీని అంతం చేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా.హిమబిందు అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మార్చి-24 ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో క్షయ వ్యాధి అవగాహన సదస్సు నిర్వహించారు. హిమబిందు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.