జట్టు ప్రయోజనాలే అన్నింటికన్నా ముఖ్యమని అని మాజీ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కోచ్ గంభీర్ జట్టు కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నా తప్పులేదని అశ్విన్ మద్దతు తెలిపాడు. విరాట్, రోహిత్ తప్పుకోవాలని కోచ్ భావించినా అది జట్టు కోసమే అవుతుందని వివరించాడు. క్రికెట్లో వ్యక్తిగత అహం కంటే జట్టు విజయమే ముఖ్యమని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించాడు.