TG: లోక్ భవన్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. ఉగాది పచ్చడి జీవితంలోని కష్టసుఖాల కలయికను సూచిస్తుందని, ప్రజలందరూ నిబద్ధతతో లక్ష్యాల వైపు అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టీస్, మండలి ఛైర్మన్, డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొన్నారు.