SS: పుట్టపర్తి సమీపంలోని కర్ణాటనాగేపల్లి వద్ద చిత్రావతి నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలపై అధికారులు మంగళవారం దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు ట్రాక్టర్లు, 1 హిటాచీ యంత్రాన్ని సీజ్ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూగర్భ శాఖ ఏడీ అమీర్ బాషా, రాయల్టీ ఇన్స్పెక్టర్ షేక్ ఖాజావలి పాల్గొన్నారు.