SDPT: పంటలకు సాగు నీటిని అందించాలని చిన్నకోడూరు మండలం గంగాపూర్లో రైతులు రైల్వే లైన్ పనులను అడ్డుకోని ఆందోళన చేపట్టారు. రంగనాయకసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న పిల్ల కాలువ పక్కన రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయని, రైల్వే లైన్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా, పనులు నిలిచిపోవడంతో సాగు నీరు వెళ్లడానికి అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.