ప్రకాశం: మార్కాపురం ఓ ప్రైవేట్ ట్యుటోరియల్ 10వ తరగతి 2005 -07 బ్యాచ్ విద్యార్థులు గెట్ టుగెదర్ ఆదివారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఆనాటి గురువులను ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.