TG: ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా బీఆర్ఎస్ పాలనలో లక్ష్యాలు నెరవేరలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు నియోజకవర్గాల్లో ప్రజల అవసరాలు తెలుసుకున్నానని చెప్పారు. ముఖ్యంగా పేదలకు ఇళ్లు అందలేదని తెలుసుకుని ఇళ్ల కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదల అవసరాలు తీరలేదని ఆరోపించారు.