అన్నమయ్య: వీరబల్లి మండలం మట్లి పంచాయతీ పరిధిలోని తొగటపల్లె మాండవ్య నదీ తీరంలో ఉన్న ప్రాచీన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో గుప్తనిధుల కోసం దుండగులు చోరబడ్డారు. దేవుని పాదాలు, శంఖు, చక్రాలకు సంబంధించిన రాతిని తొలగించారు. ఈ ఘటనపై సర్పంచ్ సోమారపు నాగార్జునచారి స్థానిక ఎస్ఐ సుస్మితకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.