SRD: అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆనందంగా ఉందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సదాశివపేట పట్టణంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను పేదలకు 3,500 ఇళ్ల పట్టాలు ఇస్తే, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. మీ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలివి లేదని ఆరోపించారు.